తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మొక్కలు కూడా నాతో సీఎం కావాలి అంటూ తమ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. వైయస్ షర్మిల కూడా ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఇదిలా ఉంటే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ థాంక్స్ పప్పు అంటూ ధన్యవాదాలు చెప్పారు. కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: