బాలయ్య టాక్ షోలో మంచు ఫ్యామిలీ అసక్తికర విషయాలను వెల్లడించింది. బాలయ్య నవ్వుతూ ప్రశ్నలు వేయ‌గా మంచు ఫ్యామిలీ కూడా అదే రీతిలో నవ్వుతూ సమాధానం ఇచ్చింది. దాంతో బాలయ్య టాక్ షో మొత్తం సరదా సరదాగా సాగిపోయింది. ఇక ఈ టాక్ షోలో తమ పర్సనల్ లైఫ్ గురించి మంచు విష్ణు మంచు లక్ష్మి మరియు మోహన్ బాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి తో మోహన్ బాబు ల మ‌ధ్య‌ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయని మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గంటగంటకు ఇద్దరికీ గొడవలవుతాయి అంటూ మంచు విష్ణు బాంబు పేల్చాడు. మోహన్ బాబు త‌న‌కు లక్ష్మి ఫోన్ చేయలేదని తిడుతూ ఉంటాడు అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. అయితే నేను చేయకపోతే ఆయన చేయొచ్చుగా అంటూ లక్ష్మీ అంటుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా విష్ణు తన తో తన తల్లితో అబద్ధాలు ఆడ‌తాడ‌ని కానీ తండ్రి మోహన్ బాబు తో మాత్రం అబద్ధాలు ఆడడు అని లక్ష్మి వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: