ఎన్ టీ పీ సి సింహాద్రి విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే వ్యర్థాలు తో పర్యావరణానికి ముప్పు పై అధ్యయనానికి కమిటీని నియమించింది జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ జిల్లా కలెక్టర్ లతో సంయుక్త కమిటీని ఎన్జీటి నియమించింది. విద్యుత్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి.. నివేదిక తయారు చేయాలని ఎన్జీటి ఆదేశాలు ఇచ్చింది.

పర్యావరణ క్లియరెన్స్, వాయు, నీరు, నేల కాలుష్యం, వ్యవసాయానికి జరిగిన నష్టం, సిఎస్‌ఆర్ నిధుల అమలు తదితర షరతులు పాటించకపోవడంపై వచ్చిన ఆరోపణలపై నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ లోగా కనీసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణం, వ్యవసాయం నష్టానికి పర్యావరణ పరిహారాన్ని అంచనా వేయాలని కమిటీని ట్రిబ్యునల్ ఈ సందర్భంగా ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

NGT