కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆమె గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ అకాడమీ పనులకు ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి కూడా పాల్గొంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  పాల్గొంటారు.


ఇంతకీ ఈ నాసిన్ అకాడమీ ఏంటంటారా.. దీని పూర్తి పేరు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్ అన్నమాట. ఈ సంస్థను రూ.600 కోట్లతో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇదో శిక్షణ కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో ఈ సంస్థను అనంతపురం జిల్లాకు కేంద్రం కేటాయించింది. అయితే ఈ సంస్థకు గతంలో 2015లోనే ఓసారి భూమిపూజ జరిగింది. అప్పట్లో  వెంకయ్య నాయుడు, అరుణ్‌ జైట్లీ వచ్చి భూమి పూజ చేశారు. అయితే.. ఈ ఏడేళ్లలో పెద్దగా పనులేమీ జరగలేదు. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మళ్లీ భూమి పూజ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: