తూర్పు గోదావరి జిల్లా పోలీసులపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఘాటు పదజాలంతో విరుచుకుపడుతున్నారు. నిన్న తనను అమలాపురం వెళ్లకుండా అడ్డుకున్న ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. తమకు పోలీసులతో శత్రుత్వం లేదని.. పోలీసులే మమ్మల్ని రెచ్చగొట్టి, చట్టానికి విరుద్ధంగా ప్రైవేటు లారీలను తమ వాహనాలకు అడ్డుపెట్టి గంటలపాటు రోడ్డుపైనే నిలువరించారని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరును ప్రతిఘటించని తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తున్నారని సోము వీర్రాజు అంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని సోము వీర్రాజు ప్రశ్నించారు.

ఐదేళ్ళు అధికారంలో ఉండే వ్యక్తుల కోసం ప్రజల భవిష్యత్తును నిర్ధారించాల్సిన అధికారులు తొత్తులుగా మారవద్దని సోము వీర్రాజు అంటున్నారు. పోలీసులు అధికార దుర్వినియోగ కార్యక్రమాలకు పాల్పడవద్దని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారారని సోమువీర్రాజు మండిపడ్డారు. వారంతా కొంతమంది వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నారన్నారు. వీరి కారణంగా   క్షేత్రస్థాయిలో సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉద్యోగాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: