క్రికెట్.. ఆటల రంగంలో దీనికి మించి ఆదరణ ఉన్న ఆటలు చాలా అరుదు. మన ఇండియాలో అయితే దీనికే అగ్రస్థానం.. అయితే ఈ స్పీడ్ యుగంలో టెస్ట్ మ్యాచ్‌లకు, వన్డేలకు ఆదరణ కరవవుతోంది. టీ 20లవైపు అంతా మొగ్గు చూపుతున్నారు. అందుకే.. 50 ఓవర్ల క్రికెట్‌ మనుగడపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.


వన్డేలకు కళ తగ్గుతోందని, అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌ నుంచి నెమ్మదిగా తొలగించాలని కొందరు మాజీ క్రికెటర్లు ఇప్పటికే అంటున్నారు. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ కోచ్‌ రవి శాస్త్రి కూడా అదే తరహాలో కామెంట్ చేశారు. వన్డే మ్యాచ్‌లను 40 ఓవర్లకు కుదించాలని అభిప్రాయపడ్డారు. వన్డే మ్యాచ్‌లను వినోదభరితంగా మార్చాలంటే వాటిని 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించాలని ఇటీవల పాక్‌ ఆటగాడు షాహిద్‌ అఫ్రిదీ అన్నాడు. ఆ అఫ్రిదీ అభిప్రాయాన్ని ఇప్పుడు రవి శాస్త్రి సమర్థిస్తున్నారు. వ్యవధిని తగ్గించడం వల్ల వన్డేలకు హానీ ఉండదంటున్నారు రవిశాస్త్రి.


మరింత సమాచారం తెలుసుకోండి: