జపాన్ సముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధ విన్యాసాలను చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆశ్చర్యపోతున్నారు. జపాన్‌ సముద్రంలో జరుగుతున్న ఈ భారీ యుద్ధ విన్యాసాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దగ్గరుండి మరీ వీక్షిస్తున్నారు. అయితే.. ఇదేదో నిజమైన యుద్ధం మాత్రం కాదు సుమా.. ఇవన్నీ వివిధ దేశాలు పాల్గొంటున్న యుద్ధ విన్యాసాలు మాత్రమే.


జపాన్ సముద్రంలో రష్యా, చైనా, భారత్‌, లావోస్‌, మంగోలియా, నికరాగువా, సిరియా వంటి దేశాలకు చెందిన 50వేల మందికి పైగా సైనికులు ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ యుద్ధ విన్యాసాల ప్రదర్శన కోసం 5వేలకు పైగా ఆయుధ వ్యవస్థలు ఇక్కడకు తరలి వచ్చాయని చెబుతున్నారు. అలా తరలి వచ్చిన వాటిలో 140 యుద్ధ విమానాలు ఉన్నాయట. ఇంకా  60 యుద్ధ నౌకలు కూడా విన్యాసాల కోసం తరలి వచ్చాయట. గత గురువారం ప్రారంభమైన ఈ సంయుక్త యుద్ధ విన్యాసాలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: