ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్‌ సంచలనానికి సిద్ధమవుతోంది. ఆ రోజు మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ సభ నిర్వహించనుంది. ఈ సభకు బీఆర్‌ఎస్‌ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పలువురు నేతలు నాందేడ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు, ఇతర ఏర్పాట్లకు వీరు తగిన సూచనలు ఇచ్చారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.


గురుద్వారాలో దర్శనం చేసుకున్న తర్వాత కేసీఆర్ సభకు హాజరవుతారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సభ అనంతరం మీడియా సమావేశం ఉంటుందని.. సభలో పలువురు జాతీయ స్థాయి నేతలు పాల్గొంటారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆ రోజున మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ  రంగాలకు చెందిన వారు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ తరహా  మోడల్ అభివృద్ధి, సంక్షేమం కావాలని మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs