ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా , పంపిణీ అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి సమీక్ష నిర్వహించారు.. ఏపీ సచివాలయంలో విద్యుత్ శాఖ, ఏపీ జెన్కో, ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి.. వచ్చే వేసవిలో విద్యుత్ కొరత ఇబ్బందులు లేకుండా దృష్టి పెట్టామన్నారు. ఈ ఏడాదిలో లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్క్షన్లు ఇచ్చామని.. మార్చిలోగా పెండింగ్ కనెక్షన్లు కూడా పూర్తి చేస్తామని.. మార్చి 31 నాటికి 100కు పైగా సబ్ స్టేషన్లను ప్రారంభిస్తామని అన్నారు.


జగనన్న కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు, సరఫరా లైన్లను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్న పెద్దిరెడ్డి.. రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండు మూడు నెలలకు ఒకేమారు బొగ్గు కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నామని.. 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యంమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: