భద్రాచలం  సీతారాములపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. సీతారాముల కల్యాణానికి ఇప్పటి వరకు నిధులను విడుదల చేయాలేదని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్‌ హైదరాబాద్‌లో విమర్శించారు. కేసీఆర్‌ కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేవలం ప్రకటన మాత్రమే చేశారని ఇంత వరకు నిధులు విడుదల చేయాలేదని వారు మండిపడ్డారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను కేసీఆర్‌ పాటించడం లేదని..  సీతారాములకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఎందుకు సమర్పించలేదని వారు ప్రశ్నించారు.


భద్రాచలం అభివృద్ధ కోసం బడ్జెట్‌లో వంద కోట్లు  కేటాయించారు కానీ...ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలేదని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అన్నారు. హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించే శ్రీరామనవమి శోభ యాత్ర, హనుమాన్‌ జయంతి విజయ యాత్రలు సాఫీగా సాగేలా పోలీసులు సహాకారించాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి కోరారు. హిందువుల మనోభవాలు కించపర్చే విధంగా వ్యవహరిస్తే మాత్రమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr