సీఎం జగన్ నిన్న పోలవరం సందర్శించారు. ఆయనకు అధికారులు పోలవరం ప్రోగ్రెస్ రిపోర్టు అందజేశారు. దాని ప్రకారం పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పూర్తయ్యింది. అలాగే.. 48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టేశారు. పోలవరం రివర్‌ స్లూయిస్‌ గేట్లు కూడా పూర్తయ్యాయి. దీంతో పాటు పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాంకూడా పూర్తయ్యింది.  దిగువ కాఫర్ డ్యాం కూడా పూర్తయ్యింది.

మరోవైపు గ్యాప్‌ -3 వద్ద కాంక్రీట్‌ డ్యాం పూర్తయ్యిందని.. పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యిందని.. అప్రోచ్‌ ఛానల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్‌-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యిందని.. ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యిందని..  ఈసీఆర్‌ఫ్‌ గ్యాప్‌-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యిందని అధికారులు వివరించారు. వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు.. పోలవరం నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: