ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల పనితీరుపై తీవ్రంగా మండిపడుతోంది. కంపెనీలో చేయాల్సిన పనికంటే ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారని గూగుల్ భావిస్తోంది.ఇక కొద్ది రోజుల క్రితమే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉద్యోగులను ఇదే విషయంలో హెచ్చరించారు. గూగుల్‌లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, అయితే చాలా తక్కువ మంది కూడా పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు సమర్ధవంతంగా పని చేయాలని, వారి ఉత్పత్తులను మెరుగుపరచడం ఇంకా వినియోగదారులకు ఎలా సహాయపడాలనే దానిపై మరింత దృష్టి పెట్టాలని ఆయన హెచ్చరించారు. ఇక ఓ కొత్త నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపుల విషయంలో గూగుల్ చాలా గట్టిగానే హెచ్చరించింది.ఆ నివేదిక ప్రకారం పరిశీలిస్తే.. కొంతమంది టాప్ గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగుల పనితీరును చూపించాలని కూడా కోరుతున్నారు. లేదంటే ఇంటికి వెళ్లేందుకు రెడీగా ఉండాలని కూడా హెచ్చరించారు. ఉద్యోగులు తమ పనితీరును కనుక పెంచుకోకపోతే.. తొలగింపులకు సిద్ధంగా ఉండాలని గూగుల్ బాస్ ప్రాథమికంగా సూచించారు.


ఇక ఇంతకీ గూగుల్ కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతాయా లేదా అనేది తదుపరి త్రైమాసిక ఆదాయాలపై ఆధారపడి ఉంటుందని గూగుల్ ఉన్నత అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.అలాగే గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులను సాధారణంగా విక్రయాల ఉత్పాదకతను పెంచేలా బాగా కష్టపడి పనిచేయాలని సూచించింది. వచ్చే త్రైమాసిక ఫలితాల్లోగా ఉద్యోగుల పనితీరు కనుక బాగా లేకుంటే విధుల్లో నుంచి తొలగింపులు తప్పవని నివేదించింది.గత కొంతకాలంగా కూడా గూగుల్ లో పనిపరమైన విషయాలు సరిగ్గా జరగడం లేదని భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని పరిగణనలోకి తీసుకుని టెక్ దిగ్గజం ఒక నెల క్రితమే ఉద్యోగ నియామకాలపై ఫ్రీజింగ్ అనేది ప్రకటించింది.ఇక తొలగింపుల గురించి గూగుల్ అధికారికంగా మాట్లాడనప్పటికీ, అందులో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన అనేది మొదలైంది. ఇప్పటికే ఇతర టెక్ కంపెనీలైన నెట్‌ఫ్లిక్స్ ఇంకా మైక్రోసాఫ్ట్ వంటి అనేక ఇతర పెద్ద టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల్లో కోతలను కూడా విధించాయి. అలాగే మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: