జగన్మోహినిని కట్టిపడేసిన జలపాతాలు.పాండవులకు నీడనిచ్చిన గుహలు.ఆంగ్లేయులను సైతం ఆహ్లాదపరచిన పచ్చదనం. వేసవిలో చల్లదనాన్ని అందించే నెలవు. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో ఉన్న జలపాతాలు.ఇక్కడున్న కొండలు,లోయలు ఎన్నెన్నో ప్రకృతి అందాలను సంతరించుకుని,ప్రతి మదిని దోచేస్తున్నాయి..వేసవి విడిదిగా పేరొందిన పచ్‌మఢీలో వున్న అందమైన ప్రదేశాలను ఒక సారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.అలాంటి సుందర దృశ్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..



ఈ ప్రదేశంలో అందరినీ ఆకట్టుకునే జలపాతం బీ ఫాల్‌.దీనిని జమునా ప్రతాప్‌ జలపాతం అని కూడ అంటారు.సుమారుగా 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదు గా ఈ జలప్రవాహం కొనసాగుతుంది.ఈ సుందరదృశ్యాలను చూడాలంటే రెండు కళ్ళు చాలవనిపిస్తుంది.ఏవైపు చూసిన పచ్చపచ్చని ప్రకృతి సోయగాలు.మనసుకు ఆనందా న్ని ప్రశాంతతను అందించే పరిసరాలు ప్రతి పర్యాటకున్ని ఎంతగానో ఆకట్టుకుంటాయనడంలో సందేహంలేదు.ఎందరో సందర్శకులు ఇక్కడి అందాలను చూస్తూ తమని తామే మరచిపోతారు అంతలా ప్రతివారిని ఆకర్శిస్తుంటాయి..అప్సర విహార్‌ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్‌మఢీ విహారం పూర్తవ్వదు.దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు జలజల పడుతుంటే కనిపించే దృశ్యానికి ప్రతివారు దాసులవక తప్పదు.



రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్‌లో కనువిందు చేస్తూ కనిపిస్తాయి.పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది.భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట.అందుకే అప్సర విహార్‌ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు.జలపాతం అందాలే కాదు..చుట్టూ పక్కలి ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.పచ్చ పచ్చని ప్రకృతి సరికొత్త వర్ణాన్ని సంతరించుకుని అందంగా ఆహ్వానం పలుకుతుంటే ప్రకృతి ప్రేమికుల ఆనందం ఆకాశం అంచులను తాకుందనిపిస్తుంది.ఈ విశ్వంలో ఎన్నోఅందమై న దృశ్యాలున్నాయి,వాటిలో ప్రకృతి దృశ్యాలు మరింతగా సరికొత్త ప్రపం చంలా మనసుకు తోస్తూ పులకరింప చేస్తాయి. అలాంటి మనోహర అందాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తుంటాయి.ఇంకెందుకు ఈ జీవితానికి కాస్త సమయం దొరికితే పబ్బులు, పార్టీలని తిరగకుండా అందమైన ప్రదేశాలను చూద్దాం పదండి..


మరింత సమాచారం తెలుసుకోండి: