మన అందాన్ని కేశాల‌తో కూడా పోల్చి చూస్తుంటారు. జ‌ట్టు వత్తుగా నల్లగా ఉంటే మంచి ఆరోగ్యంగా కూడా ఉన్నట్లే. ఇక ముఖంతో పాటు జుట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. కొందరు జుట్టే తమ స్టేటస్ సింబల్, స్టైలిష్ ఐకాన్ అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. జుట్టు విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అవి.. ఇవి అని ఏవేవో వాడుతుంటారు. అయితే కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ వాడ‌డం క‌న్నా న్యాచుర‌ల్ ప్రోడెక్ట్స్ వాడ‌డం చాలా మంచిది. అలాంటి న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో నువ్వుల నూనె, కొబ్బ‌రి నూనె ముందుంటాయి.

 

అయితే ఈ రెండు నూనెలను అన్ రిఫైండ్ స్వచ్చమైన వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈ నూనెల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండు నూనెలను కలిపి ఉపయోగించడం వల్ల జుట్టు మరియు చర్మ అందం మెరుగుపడుతుంది. ఈ రెండింటిని జోడించడం ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం తగ్గించడానికి మరియు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనె, కొబ్బరి నూనె మిశ్రమం చుండ్రు సమస్యను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. 

 

ఈ నూనెల మిశ్రమాన్ని తలపై అప్లై చేయాలి. అలాగే గోరువెచ్చని నూనెను తలకు రాసి, కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి. రెండు మూడు గంటల తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి. దాంతో మీ జుట్టు సాఫ్ట్ గా మరియు షైనీగా మెరుస్తుంటుంది. ఇక పడుకునే ముందు కొద్దిగా నువ్వుల నూనె చేతిలో వేసి ముఖానికి రాసుకోవాలి. ఇది మీ చర్మానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. నువ్వుల నూనె చర్మంలో నలుపు తగ్గించడానికి మరియు చర్మం ప్రకాశం మరియు రంగును పెంచడానికి సహాయపడుతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: