కరివేపాకు అంటే తెలియని వారుండరు. ఎందుకంటే మన ఇండియన్ వంటల్లో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మంది క‌రివేపాకును తేలిగ్గా తీసిపారేస్తుంటారు. వాస్త‌వానికి కరివేపాకులో ఆరోగ్య సంజీవని దాగివుందన్న రహస్యం తెలిస్తే.. దాని కోసం పరుగులు తీస్తారు. అందానికి ఆరోగ్యానికీ కరివేపాకు మేలంటే అతిశయోక్తి కాదేమో.  ముఖ్యంగా కరివేపాకు కూరలో ఎంతటి సువాసన ఇస్తుందో ముఖానికీ అంతే సౌందర్యాన్ని తెస్తుంది. జుట్టుకూ పోషణనిస్తుంది. మరి దాన్నెలా ఉపయోగించాలో ఓ లుక్కేసేయండి.

 

కరివేపాకు పేస్ట్, శనగపిండి, పాలు లేదా పెరుగు వేసి బాగా కలిపి ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకుని పావు గంట‌ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉన్న మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. మ‌రియు కరివేపాకును స్మూత్ గా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. పావు గంట‌ తర్వాత ముఖం క్లీన్‌ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న మ‌లినాలు తొల‌గి కాంతివంత‌గా మారుతుంది.

 

అదేవిధంగా, జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని త‌ల‌కు మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత మామూలు నీళ్లతో తలస్నానం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌రియు  కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: