ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...చాలా మందికి యుక్త వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. అలాగే కొత్తగా తెల్లని వెంట్రుకలు పుట్టుకొస్తాయి. అలాంటి తీవ్రమైన సమస్యను పూర్తిగా తగ్గించుకోవాలంటే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు ఇంటి చిట్కాలు తప్పకుండా పాటించండి...మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేయండి. పాన్ అడుగున నల్లగా ఏర్పడేవరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత స్కాల్ప్ నుండీ జుట్టు చివర వరకూ నెమ్మదిగా పట్టించండి. ఒక గంట తరువాత సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. కరివేపాకు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ని రిస్టోర్ చేస్తుంది. దీని వల్ల జుట్టు బాగా పెరుగుతుంది కూడా.రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలపండి. దీన్ని స్కాల్ప్ నుండి జుట్టు చివరల వరకూ నెమ్మదిగా పట్టించండి. అలా ముప్ఫై నిమిషాలు వదిలేయండి. సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.


దీని వల్ల ఆల్రడీ తెల్లబడిన జుట్టు నల్లగా మారదు కానీ, కొత్త తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.ఒక కప్పు నీళ్ళు మరగబెట్టి అందులో రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించండి. ఈ మిశ్రమం చల్లారాక మీ జుట్టుకి పట్టించి ఒక గంట ఆరనివ్వండి. ఆ తరువ చన్నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా రెండు వారాలకి ఒకసారి చేయవచ్చు. బ్లాక్ టీ మీ హెయిర్ కి బ్లాక్ కలర్ ని ఇస్తుంది. అలాగే, డల్ హెయిర్ ని రివైవ్ చేస్తుంది.మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేసి వేడి చేయండి.


ఈ పొడి నల్లబడే వరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత ఈ నూనె తో జుట్టు కుదుళ్ళ నుండీ చివరల వరకూ మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేయండి. ఒక గంట అలా వదిలేయండి. లేదా రాత్రంతా కూడా అలాగే ఉంచేయవచ్చు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికిల్స్ దగ్గర ఉండే మెలనిన్ ని ప్రిజర్వ్ చేస్తుంది. దీని వల్ల తెల్ల జుట్టు పెరిగే ప్రాసెస్ అనేది స్లో అవుతుందట.. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: