ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..స్నానం శరీరానికి చాలా అవసరం. చర్మాన్ని సౌందర్యం గా ఉండడం తో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.చాలా మందికి ముఖ్యంగా ఈ చలికాలంలో స్నానం ఏం చేస్తాంలే అని బద్ధకంగా ఉంటారు జనాలు. కాని రోజుకి రెండుసార్లు స్నానం చేస్తే చాలా మంచిది. ఎక్కువ రోజులు స్నానం చేయకుండా కాలక్షేపం చేస్తే.. చర్మం పాలిపోయినట్లుగా మారుతుంది. ముదురు ఎరుపు రంగులో పాచెస్ వస్తాయి.రోజూ స్నానం చేయకపోతే కొత్త వ్యాధులు దాడి చేస్తాయి. చర్మంపై అనేక  జాతుల బ్యాక్టీరియాలు జీవిస్తున్నాయి. స్నానం చేయడం వల్ల మంచి సూక్ష్మజీవులు సంతులనం జరిగి చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికర బ్యాక్టీరియా నాశనమవుతుంది.ముఖాన్ని శుభ్రం చేసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు ఎక్కువగా వస్తాయి.


ఈ కరోనా సమయంలో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి రోజుకి రెండు సార్లు స్నానం చెయ్యడం చాలా మంచిదే.స్నానం చేయకపోతే శరీరం దుర్వాసన వెదజల్లుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా ఎదుగుదలకు సహకరిస్తుంది.రోజు గోరు వెచ్చని నీటితో రెండు పూటలా స్నానం చెయ్యడం వలన ప్రాణం హాయిగా ఉంటుంది. నిద్ర లేమి సమస్య ఉండకుండా నిద్ర ప్రశాంతంగా పడుతుంది. అలాగే మొటిమల సమస్యలు వుండవు. కాబట్టి రోజు రెండు పూటలా స్నానం చెయ్యండి. ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: