చాలా మందిని అవాంచిత రొమాల సమస్య చాలా తీవ్రంగా వేధిస్తుంది. వాటిని నాచురల్ గా ఈ టిప్స్ తో తొలగించుకోవచ్చు.ఒక బొప్పాయి కాయ ముక్క ,కలబంద జెల్‌, శెనగపిండి, పసుపులను కలిపి శరీరానికి రాసుకోవాలి. బొప్పాయిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ కుదుళ్లలోకి వెళ్లి రోమాలు పెరగకుండా చేస్తుంది. ఇదేకాకుండా శెనగపిండి, పాలు, పసుపులను పేస్ట్‌లా చేసి వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.పంచదార, నిమ్మరసం, తేనెల మిశ్రమాన్ని వాడినా అవాంఛితరోమాలు తొలగించుకోవచ్చు. పంచదారను నీటితో కలిపి రాస్తే రొమాలు తొలగిపోవడానికి ఇది మంచిగా పనిచేస్తుంది.


నిమ్మరసం ఒక అద్భుతమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. అవాంఛిత రోమాలను శరీరం నుండి తొలగిస్తుంది.పసుపు, శెనగపిండి, వేపాకు పొడి, పచ్చి పాలు వాడాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట ఉండాలి. పూర్తిగా ఆరిపోకముందే చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్‌గా పనిచేసి రోమాలు పెరగకుండా నిరోధిస్తుంది. శెనగపిండి, పాలు సహజసిద్ధ క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి. అవాంచిత రొమాలు తొలగిపోతాయి.


చేతులు, కాళ్ల వంటి భాగాల్లో అవాంఛితరోమాలను తొలగించేందుకు అరటి, బియ్యప్పిండిలతో తయారుచేసిన స్క్రబ్‌ బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరమంతటా రాసుకుని మర్దనా చేసుకుంటే అవాంచిత రొమాలు తొలగిపోతాయి.శెనగపిండి, గంధం ఒక్కోటి రెండు టేబుల్‌ స్పూన్లు చొప్పున, తాజా మీగడ, ఆముదం, రోజ్‌వాటర్‌లు ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకుని కొద్దిగా పసుపు కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రాంతంలో రాయాలి. పావుగంట తరువాత అపసవ్య దిశలో మర్దనా చేయాలి.


ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే అవాంచిత రొమాలు తొలగిపోతాయి.ఎర్ర కందిపప్పును బాగా గ్రైండ్‌ చేశాక అందులో కొద్దిగా తేనె, గంధం, ముల్తాని మట్టి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మం మీద రాసుకోవాలి. ఆరిన తరువాత అపసవ్య దిశలో మర్దనా చేసి, కడిగేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాల పెరుగుదల తగ్గిపోతుంది.గుడ్డు తెల్లసొనలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మాస్క్‌లా వేసుకున్నా ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. మాస్క్‌ లాగుతున్నప్పుడు అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: