రష్మిక తల్లి సుమన్ మందన్న గతంలో మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. అయితే ఆ ఆడియో క్లిప్ ప్రకారం రష్మిక మరియు రక్షిత్ శెట్టిల మధ్య గొడవకు ముఖ్య కారణం రష్మిక కెరియర్ అని, వివాహం తరువాత రష్మిక సినిమాలలో నటించకూడదని నటనకు గుడ్ బై చెప్పాలని , అటు రక్షిత్ అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారంటూ రష్మిక తల్లి చెప్పినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా తాను సినిమాలలో నటించనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాలని కూడా వారు ఒత్తిడి తెచ్చారని , అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీతాగోవిందం సినిమాలో కిస్సింగ్ సీన్ పట్ల కూడా రక్షిత్ శెట్టి చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారంటూ ఆ వీడియోలో ఉన్నది.
ఈ అంశం పైన రష్మిక తన అభిమాన నటిగా తనని ఆదరిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు తనని లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారని, నేను అనని మాటలను అన్నట్టుగా సృష్టించి నా వ్యాఖ్యలను సందర్భం లేకుండా వ్యూస్ కోసం ఉపయోగించుకొని ద్వేషాన్ని పెంచేలా చేస్తున్నారని, పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు విమర్శలు సహజమే కానీ వాటిని ఇప్పటిదాకా భరించాను.. ఇప్పుడు లైన్ దాటేశారు, ఇకమీదట తాను భరించానని, 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను తన అనుమతి లేకుండా రికార్డు చేసి మరి ఇప్పుడు వైరల్ చేయడం, అలాగే ఈ వ్యవహారంలో తన కుటుంబ సభ్యులను లాగడం అత్యంత దురదృష్టకరమని తెలియజేసింది. ఆ వీడియో అప్లోడ్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వెంటనే డిలీట్ చేయకపోతే రేపటి నుంచి చట్టమైన చర్యలు చేపడుతామంటూ వారికి లీగల్ నోటీసులు కూడా పంపిస్తామంటూ హెచ్చరించింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ట్విట్ కూడా వైరల్ గా మారింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి