ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ (Epic: First Semester) అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘సంచారమే’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుండటంతో.. విజయ్, రష్మిక మరియు ఆనంద్ కలిసి ఈ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు.
పెళ్లి తర్వాత రష్మిక తన మరిది ఆనంద్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. ముగ్గురూ కలిసి చిందేస్తున్న ఈ వీడియో చూస్తుంటే.. దేవరకొండ ఫ్యామిలీలో పెళ్లి సందడి ఇంకా తగ్గలేదనిపిస్తోంది.
ఈ వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఒక హార్ట్ టచింగ్ మెసేజ్ కూడా జోడించాడు. “ఇది కొంచెం గందరగోళంగా (Messy) కనిపించవచ్చు.. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న రాసిన ఈ పాటను, హేశం అబ్దుల్ వహాబ్ తన గాత్రంతో మ్యాజిక్ చేశారు. ఇప్పుడు ఈ దేవరకొండ బ్రదర్స్ అండ్ రష్మిక వీడియోతో ఈ సాంగ్ వ్యూస్ ‘నెక్స్ట్ లెవల్’కు వెళ్లడం ఖాయం.
రాజస్థాన్ ప్యాలెస్‌లో జరిగిన పెళ్లి ఫోటోలు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు విజయ్ సొంతూరులో జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి మధ్య విజయ్ - రష్మిక జోడీని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు.ఆనంద్ దేవరకొండ తన అన్నయ్య, వదినల సాయంతో ‘ఎపిక్’ ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకెళ్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి