మొటిమలతో జీవించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం కోల్పోతుంది.మొటిమలు తగ్గించుకోవాలనే తాపత్రయంతో మీరు ఎక్కువ కెమికల్ డోస్ తో ప్రభావవంతమైన చిట్కాలతో మొటిమలను అరికట్టాలని ప్రయత్నాలు చెయ్యొద్దు. ఇక రెగ్యులర్ గా చర్మ పరిశుభ్రత పాటించండి. అలాగే అదనపు ధూళి, చెమట ఇంకా జిడ్డును తొలగించడానికి ప్రతిరోజూ రెండుసార్లు తేలికపాటి సబ్బు లేదా ఫేస్ వాష్ తీసుకొని గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచండి. వాటితో ముఖాన్ని కఠినంగా రుద్దకండి. ఇక ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్‌తో చర్మాన్ని ఎప్పుడూ తేమగా చేసుకోండి. అలాగే మీ ముఖాన్ని మీ చేతులతో మళ్లీ మళ్లీ తాకవద్దు. అలాగే జుట్టు వల్ల వచ్చే చుండ్రు కూడా మొటిమలకు కారణం. కాబట్టి జుట్టును క్రమం తప్పకుండా కడగాలి. ఇక ఈ సమ్మర్ లో అయితే డైలీ తల స్నానం చెయ్యటం బెటర్.ఇక హెవీగా
మేకప్ అస్సలు వెయ్యొద్దు. అసలు
మేకప్ కిట్ లకు దూరంగా ఉండటం చాలా మంచిది.
హైపర్ పిగ్మెంటేషన్ నివారించడానికి మంచి
నూనె లేని సన్‌స్క్రీన్ ఉపయోగించండి సంక్రమణ మరియు మచ్చలను నివారించడానికి వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ లేదా పాప్ మొటిమలను అస్సలు గిల్లొద్దు.మంచి ఆహారం ఇంకా జీవనశైలి కూడా చాలా ముఖ్యం.హైడ్రేటెడ్ మరియు గ్లోయింగ్ స్కిన్ కోసం రోజుకి ఎక్కువ నీరు త్రాగాలి. అలాగే మీ ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలను జోడించండి. ఇంకా క్రమం తప్పకుండా ధ్యానం,
యోగా చెయ్యండి. అలాగే టయానికి నిద్ర పోండి.
స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండండి.
స్మార్ట్ ఫోన్ కి ఎక్కవ
బాక్టీరియా ఉంటుంది. అందువల్ల మొటిమలు వచ్చే ప్రమాదం వుంది. అలాగే
ఫోన్ ముఖానికి టచ్ చెయ్యకుండా ఇయర్ ఫోన్స్ వాడుతూ
ఫోన్ మాట్లాడటం చాలా బెటర్. ఎందుకంటే
ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ
బాక్టీరియా మన ముఖానికి తాకుతుంది. అందువల్ల ముఖం పాడయ్యి మొటిమలు వస్తాయి.ఈ పద్ధతులు పాటిస్తే జీవితకాలం మొటిమల సమస్య వేదించదు.