వయసు పెరుగుతున్నా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే?


వయసు మీద పడుతున్న అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. పండ్లు, కూరగాయలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్, నీటిని కలిగి ఉంటాయి. ఫైబర్ వల్ల జీర్ణ క్రియ బాగా మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఈజీగా అదుపులో ఉంటాయి. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, మొక్కల నుంచి లభ్యమయ్యే ఇతర ఆహారం చాలా ఎక్కువ ఫైబర్‌తో, తక్కువ క్యాలరీలతో ఉంటుంది.  ప్రతి సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇక మన శరీరంలో సోడియం పాత్ర చాలా కీలకమైనది. అయితే దానిని అవసరానికి మించి వాడితే ఎలాంటి ముప్పు తప్పదు. ప్రి-ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువ సోడియం స్థాయి కలిగి ఉంటుంది. 


దీని వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంకా అలాగే గుండె జబ్బుల ముప్పు తప్పదు. కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోవడం మంచిది.అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు,అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మన శరీరానికి అవసరం. ఇవి అవకాడో, గింజలు, ఆలివ్ ఆయిల్ ఇంకా అవిసె గింజలు వంటి వాటిలో లభిస్తాయి. ఇవి ఊబకాయం, డయాబెటిస్ ఇంకా అలాగే ఇతర వ్యాధులతో పోరాడుతాయి.అలాగే శరీరం తన విధులు నిర్వర్తించడంలో ప్రోటీన్లది కీలకపాత్ర. 40 ఏళ్ల వయస్సులో కండర శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రోటీన్ తప్పక పెంచాలి. ఇక చిక్కుళ్లలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ ఇంకా శనగల్లో ప్రోటీన్ లభిస్తుంది. వాల్‌నట్, బాదం, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇంకా అలాగే గుమ్మడి గింజలు , విత్తనాలు మీ కండర పటుత్వానికి చాలా సహాయం చేస్తాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి చాలా ఆరోగ్యంగా ఇంకా అందంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: