ఎండ వల్ల నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి రకరకాల  క్రీములను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల అంతగా ఫలితం ఉండకపోవడంతో పాటు ఇవి చాలా ఖర్చుతో కూడా కూడుకున్నవి.అయితే ఒక అద్భుతమైన టిప్ ని వాడి ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని చాలా సులభంగా మనం తెల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం నల్లగా మారిన వారు ఈ టిప్ ని పాటించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి ముఖాన్ని తెల్లగా మార్చే చిట్కా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి  మనం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఫేస్ మాయిశ్చరైజింగ్ క్రీమును తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను ఇంకా అలాగే ఒక విటమిన్ఆయిల్ క్యాప్సుల్ ను వేసి కలపాలి.


ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఉదయాన్నే నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ టిప్ ని వాడే ముందు మాత్రం ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.తరువాత బాగా శుభ్రమైన టవల్ తో ముఖాన్ని తుడుచుకుని ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.ఇక ఈ విధంగా ప్రతి రోజూ రాత్రి ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే నల్లగా మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇంకా అలాగే ఈ మిశ్రమంలో ఫేస్ మాయిశ్చరైజర్ కు బదులుగా బాడీ మాయిశ్చరైజర్ క్రీమును వేసి శరీరానికి కూడా మీరు రాసుకోవచ్చు. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల ముఖంపై పేరుకుపోయిన నలుపు ఇంకా ట్యాన్ తొలగిపోయి ముఖం అందంగా అలాగే కాంతివంతంగా మారుతుంది. నిర్జీవంగా మారిన ముఖం తిరిగి ప్రకాశవంతంగా అలాగే చాలా మృదువుగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: