ముఖంపై మొటిమల సమస్యలతో బాగా బాధపడే వారు ఇప్పుడు చెప్పే వాటిని పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.మొటిమలతో బాధపడే వారు చాలా మంది కూడా వీటిని గిల్లుతూ ఉంటారు. కానీ మొటిమలను అస్సలు గిల్లకూడదు. ఎందుకంటే మొటిమలను గిల్లడం వల్ల ఆ భాగంలో మచ్చలు, గుంతలు ఏర్పడతాయి. ఇంకా అలాగే మొటిమలపై ఎక్కువగా రుద్దకూడదు. నెమ్మదిగా చేత్తో మాత్రమే రుద్దాలి. ఇంకా అలాగే కాటన్ వస్త్రంతో నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అలాగే మొటిమలతో బాధపడే వారు ఖచ్చితంగా ముఖానికి 5 నుండి 10నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉండే వ్యర్థాలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి తేనెను రాసుకోవాలి.ఎందుకంటే మంచి నాణ్యత కలిగిన తేనెను తీసుకుని మొటిమలపై నెమ్మదిగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ప్లామేషన్ అనేది తగ్గుతుంది. మచ్చలు ఈజీగా తొలగిపోతాయి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మొటిమలతో బాధపడే వారు ముఖానికి మడ్ ప్యాక్ ని వేసుకోవాలి.


నల్లటి మెత్తటి మట్టిని తీసుకుని నీటిలో వేసి 5 నుండి 6 గంటల దాకా నానబెట్టాలి. ఆ తరువాత ఈ మట్టిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి. దీనిని ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల భాగానికి రక్తప్రసరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీంతో ఈ భాగంలో వ్యర్థాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. చర్మ కణాలు చాలా ఆరోగ్యంగా తయారవుతాయి.అప్పుడు మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ఇంకా అలాగే వీటితో పాటు రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల వ్యర్థాలు ఈజీగా తొలగిపోతాయి.ఎందుకంటే శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల కూడా మొటిమల సమస్య తలెత్తుతుంది. కాబట్టి రోజూ 4 లీటర్ల నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఇలా చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే ఉదయం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. సాయంత్రం విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలా పండ్ల జ్యూస్, బత్తాయి జ్యూస్ వంటి వాటిని తాగాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు లేని వారికి రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: