ఈ రోజుల్లో చాలా మంది కూడా యుక్త వయస్సు నుంచే చర్మ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. నేటి కాలంలో బిజీ బిజీ జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం ముఖంపై చాలా సమస్యలని కలిగిస్తుంది.దీని వల్ల ఎంతో అందమైన ముఖం కూడా చాలా డల్ గా కనిపించడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితిలో మన వంటింట్లో లభించే మసాలలతో తయారు చేసిన సహజసిద్ధమైన టీ తాగడం వల్ల ముఖ సమస్యలను చాలా ఈజీగా. అలాంటిదే సోంపు, జీలకర్ర ఇంకా ధనియాలతో తయారు చేసిన అద్భుత టీ. సోంపు, జీలకర్ర ఇంకా అలాగే ధనియాలు అన్ని ఇళ్లలో వాడతారు. ఆహారం యొక్క రుచి, పోషకాలను మెరుగుపరచడానికి వీటిని ఉపయోగిస్తారు.అందానికి ఇంకా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను పొందడానికి, మీరు జీలకర్ర, సోంపు, ధనియాల కషాయంతో టీని తయారు చేసుకుని తాగొచ్చు. దీని వల్ల  చాలా ప్రయోజనాలను మనం ఈజీగా పొందగలం.ఇంకా అంతే కాకుండా ఈ మూడింటిని కలిపి టీ తయారు చేసి తాగవచ్చు. వేసవి కాలంలో శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా చాలా విషయాల్లో ఈ అద్బుత టీ ఎంతగానో మేలు చేస్తుంది. ఇది రోజంతా కూడా తాజాదనంతో ఉండేలా సహజమైన మెరుపును ఇస్తుంది.


జీలకర్ర, సోంపు ఇంకా ధనియాలతో తయారు చేసిన టీ చర్మానికి యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఈ మూడింటిలో ఖనిజాలు, విటమిన్లనేవి ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలపై సంపూర్ణంగా పనిచేసే క్రిమినాశక లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.అంతేగాక దీని వల్ల ముఖంపై ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.వేసవి కాలంలో జిడ్డు చర్మంతో బాధపడేవారు ఈ టీని ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే వేడి, చెమట కారణంగా, చర్మంపై ఎక్కువ నూనె అనేది కనిపిస్తుంది. దానిపై మురికి కూడా పేరుకుపోతుంది. ఇది చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.ఈ టీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ముందుగా ఈ టీ చేయడానికి, అర టీస్పూన్ జీలకర్ర, ధనియాలు ఇంకా సోంపు తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం బాగా మరిగించి ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. దానికి కొంచెం తేనె, సగం నిమ్మకాయ ఇంకా ఉప్పు కలుపుకుంటే, ఈ టీ సిద్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: