ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా రంగ రంగ వైభవంగా జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ సంవత్సరం మిస్ వరల్డ్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇక ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలపై జనాల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అసలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ..? అలాగే ప్రపంచ సుందరిగా నిలవాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ..? అనే ప్రశ్నలు జనాల్లో పెద్ద ఎత్తున రేకెత్తుతున్నాయి. మరి ప్రపంచ సుందరి కాంపిటీషన్లో పాల్గొనాలి అంటే ఏ అర్హతలు ఉండాలి ..? విజేతను ఎలా ఎంపిక చేస్తారు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలి అంటే వారికి అసలు పెళ్లి జరిగి ఉండకూడదు. అలాగే పిల్లలు కూడా ఉండకూడదు. అలాగే ఈ పోటీల్లో పాల్గొనే వారి వయస్సు 17 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. అలాగే ఈ పోటీల్లో పాల్గొనే వారిపై అస్సలు ఎలాంటి కేసులు ఉండకూడదు.

ఇక మిస్ వరల్డ్ పోటీల్లో విజేతను ఎలా ఎంపిక చేస్తారు అనే విషయంలోకి వెళితే ... ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. కంటెస్టెంట్ లను వారి ఖండాల ఆధారంగా ఆసియా- ఓసియానా , ఆఫ్రికా , యూరప్ , అమెరికా - కరేబియన్ గ్రూపులుగా వారిని విభజిస్తారు. ఇక వీరి నుండి ఒక్కో ఖండం కి చెందిన పది దేశాలకు చెందిన సుందరి మనలో క్వార్టర్ ఫైనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత వీరిలో టాప్ 5 ని ఎంపిక చేస్తారు. అందులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన వారిలో నుండి టాప్ 2 ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ప్రతి ఖండం నుంచి ఒకరిని విజేతగా, ఒకరిని రన్నర్ గా ప్రకటించి వారిని విజేతలుగా ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: