నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలోని వివాహ వేడుక కారణంగా 50 మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 193 గృహాలున్న చెక్కి క్యాంపులో 42 ఇళ్లలోని వారికి వైరస్ సోకింది. దీంతో కొవిడ్ భయంతో ఇక్కడ పాలు కొనడానికి ఎవరూ రావడం లేదు. పాల కేంద్రం 20 రోజులు మూసి ఉంచాలని నిర్ణయించారు.