ఈ పోస్టు వల్ల వీరిద్దరి బ్రేకప్ కన్ఫర్మ్ అయ్యిందనే విధంగా వినిపిస్తున్నాయి. విజయ్ వర్మ తన ఇంస్టాగ్రామ్ లో ఒక గుర్తు తెలియని యువతీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఫరెవర్ అంటూ ఒక క్యాప్షన్ తో అమ్మాయితో చేయి పట్టుకొని మరి నడుస్తూ ఉన్నట్టుగా ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. ఈ ఫోటో క్షణాలలో వైరల్ కావడంతో తమన్నా అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ పోస్టులో ఒక చిన్నపాటి ట్విస్టు కూడా ఉందంటూ వినిపిస్తున్నాయి. అదేమిటంటే విజయ్ వర్మ ఆ ఫోటోను టాక్ చేసిన అకౌంట్ కూడా ఒరిజినల్ కాదని అది ఏదో ఫ్రాంక్ లేదా బ్రాండ్ ప్రమోషన్ అయి ఉంటుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొదట ఈ విషయం పైన నేటిజన్స్ సైతం సీరియస్ గా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత అకౌంట్ డీటెయిల్స్ చూశాక కేవలం ఇదేదో పబ్లిసిటీ స్టంట్ కోసమే అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ తమన్నా కు విజయ్ పెద్ద షాక్ ఇచ్చారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పైన తమన్నా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి