ప్రపంచ దేశాలలో వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి కర్ణాటకకు చెందిన బాల మేధావి అభిగ్య ఆనంద్ ఏడు నెలల కిందటే చెప్పాడు. 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని అభిగ్య ఆనంద్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని వ్యాఖ్యలు చేశాడు. కొన్ని రోజుల క్రితం అభిగ్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
మే 31 వరకు కరోనా ముప్పు ఉంటుందని అభిగ్య తన వీడియోలో పేర్కొన్నాడు. ప్రముఖ హేతువాది బాబు గోగినేని అభిగ్య చెప్పినవాటిలో సక్సెస్ అయినవి మాత్రమే చర్చకు వస్తున్నాయని సక్సెస్ కానివి చర్చకు రావడం లేదని విమర్శలు చేశారు. అభిగ్యను బడికి పంపాలంటూ కామెంట్లు చేశారు. అయితే అభిగ్యపై బాబు గోగినేని విమర్శలు చేయడంతో నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. 
 
అభిగ్య బాల మేధావి అని..... అభిగ్యపై  విమర్శలు చేయడం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం బాబు గోగినేనికి మద్దతు తెలుపుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: