నిన్న చైనా అకస్మాత్తుగా భారత్ తో ఘర్షణకు దిగింది. సిక్కిం రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో చైనాకు చెందిన ఏడుగురు, భారత్ కు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. చైనా నో మ్యాన్ జోన్ ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే భారతీయ సైనికులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని ప్రధానంగా వినబడుతోంది. 
 
ఈ ఘటన వెనుక చైనా ప్రభుత్వం సపోర్ట్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా చైనా ప్రభుత్వం ఈ ఘటన గురించి స్పందించింది. చైనా సైనికులు సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కట్టుబడి ఉంటారని వ్యాఖ్యలు చేసింది. భారత్‌, చైనాలు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయం సాధించేందుకు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయని అన్నారు. అభిప్రాయభేదాలను సరైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు. భారత్ చైనాల మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి సైనికుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: