రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మూడు రోజుల క్రితం రైతుల ఖాతాలలో రైతు భరోసా నగదును జమ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా నేటి నుంచి గ్రామ సచివాలయాల దగ్గర ఖరీఫ్ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం రైతుల కోసం 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. 
 
ఇ క్రాప్ బుకింగ్ ఆధారంగా ప్రభుత్వం రైతులకు విత్తనాలను అందజేయనుంది. ప్రభుత్వం వేరుశనగ, వరి, జీలుగ,జనుము, పిల్లి పెసర, పచ్చిరొట్ట సబ్సిడీపై పంపిణీ చేయనుంది. 13 రకాల వరివంగడాలపై ప్రభుత్వం 500 రూపాయల సబ్సిడీ ఇవ్వనుంది. అధికారులు గ్రామ సచివాలయాల దగ్గర విత్తనాల ధరల పట్టికకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లో జాతీయ ఆహార భద్రతా మిషన్ వరి వంగడాలకు సబ్సిడీ రెట్టింపు చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: