అసిడిటీకి తక్షణ ఉపశమనం కోసం వాడే ట్యాబ్లెట్ లలో జిన్‌టాక్ ఒకటి. అసిడిటీ రోగులు ఎక్కువగా ఉపయోగించే ఈ ట్యాబ్లెట్ వల్ల క్యాన్సర్ భారీన పడే అవకాశం ఉందని ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. జిన్‌టాక్ ట్యాబ్లెట్లలో ఉండే నైట్రోసోడిమిథైలమైన్ క్యాన్సర్ కారకమని ఔషధ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఔషధ నియంత్రణ మండలి సూచనలతో గ్లాక్సోస్మిత్‌క్లిన్ ఫార్మా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో జిన్‌టాక్ ట్యాబ్లెట్ ఉత్పత్తిని, సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేసింది. 
 
దీంతో దేశంలో జిన్‌టాక్ 150 ఎంజీ, జిన్‌టాక్ 300 ఎంజీ ట్యాబ్లెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి ఉపమశమనం కలిగించేందుకు వాడే ట్యాబ్లెట్ క్యాన్సర్ కారకమని తెలియడంతో ఈ ట్యాబ్లెట్ ఉపయోస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. జిన్‌టాక్(రానిటిడిన్‌) టాబ్లెట్ల ఉత్పత్తిని నిలిపివేయాలని గతంలోనే ఈ సంస్థ భావించగా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: