ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన - మీ సూచన సదస్సులో భాగంగా ఈరోజు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. జగన్ మాట్లాడుతూ ఏపీలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ మేనిఫెస్టో పంపిస్తామని తెలిపారు. పథకాల అమలు గురించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరిస్తామని అన్నారు. ప్రజల్లో మేనిఫెస్టో గురించి అభిప్రాయాలను సేకరించడం ద్వారా పథకాల అమలు గురించి తెలుస్తుందని... ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎం చెప్పారు. 2021 మార్చిలోపు రాష్ట్రంలో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 
 
రాష్ట్రంలో 58.61 లక్షల మందికి పెన్షన్ ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచామని... ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పథకాల అమలు జరుగుతోందని సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: