ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా మూడో రోజు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో మనం మన పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించడం వృథా అని ప్రజల్లో అభిప్రాయం ఉండేదని అన్నారు. 
 
2011 సంవత్సరంలో దేశంలోని చదువురాని వాళ్ల శాతం 27 శాతం ఉంటే... ఏపీలోనే 33 శాతం ఉందని అన్నారు. దేశంలోని నిరక్ష్యరాస్యత కంటే రాష్ట్రంలోని నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉందని అన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడనని సీఎం జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: