దేశంలో కరోనా వైరస్ విజృంభణ వల్ల పీపీఈ కిట్ల వినియోగం పెరిగింది. వైద్యులతో పాటు వివిధ వ్యాపారాలు నిర్వహించేవారు సైతం పీపీఈ కిట్లను వినియోగిస్తున్నారు. అయితే సాధారణంగా ఒకసారి ధరించిన పీపీఈ కిట్లను మరోసారి ఉపయోగించటం వీలు కాదు. ఐతే తమిళనాడులోని టెక్స్ టైల్ కంపెనీ వాష్ చేసి ఉపయోగించుకునే పీపీఈ కిట్లను ఈ తయారు చేసింది. ఈ కంపెనీ ఒకసారి వాష్ చేసిన పీపీఈ కిట్ ను 80 సార్లు ధరించవచ్చని పేర్కొంది. 
 
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ పీపీఈ కిట్ లో క్లోరిన్ ను వినియోగించామని... అందువల్ల ఈ కిట్లకు 80సార్లు తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కిట్ కు సిట్రా సర్టిఫికేషన్ ఉందని ఆయన పేర్కొన్నారు. మరలా వినియోగించుకునే పీపీఈ కిట్లు అందుబాటులోకి రావడం వల్ల పీపీఈ కిట్ల కోసం చేసే ఖర్చు తగ్గనుంది. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: