ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాతో ఉద్రిక్తతల వేళ 59 చైనా యాప్ లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర 59 యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఈ నెల 15న గల్వాన్ లోయ దగ్గర జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం చైనా యాప్ లపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. 
 
చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి భారత జవాన్లను బలి తీసుకున్నారని మన దేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చైనా సైనికులు 40 మందికి పైగా చనిపోయినా ఆ దేశం మృతుల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. చైనా భారత్ మధ్య చర్చలు జరుగుతున్నా సరిహద్దు ప్రాంతాల్లో చైనా బలగాలను మోహరిస్తూ ఉండటంతో భారత్ కూడా భారీగా బలగాలను మోహరిస్తోంది. భారత్ చైనా యాప్ లను నిషేధించటం చైనాకు భారీ షాక్ అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: