గతంలో పాత సచివాలయాన్ని కూల్చివేసి నూతన హంగులతో కొత్త సచివాలయం నిర్మించడానికి తెలంగాణ సర్కార్ సంకల్పించిన నేపథ్యంలో దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో కొత్త సచివాలయం నిర్మాణ కాస్త  వాయిదా పడింది. 


 ఇక తాజాగా హైకోర్టు కొత్త సచివాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా పాత సచివాలయం వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పాత సచివాలయాన్ని కోవిడ్  ఆస్పత్రిగా మార్చాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: