న్యాయవాది ఫిర్యాదు తో మల్లన్న అలియాస్ నవీన్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్
కుమార్ పై సైబర్ క్రైమ్
పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తన అనుమతి లేకుండా తన వీడియో ను క్యూ న్యూస్
యూట్యూబ్ ఛానెల్ లో వాడిన మల్లన్నపై
ఫిర్యాదు చేసారు. తన వీడియో పై అసభ్యంగా కామెంట్స్ పెట్టించిన మల్లన్న పై సీసీఎస్ లో ఫిర్యాదు చేసారు.
ఆయనపై హైకోర్టు
న్యాయవాది అరుణ కుమారి ఫిర్యాదు చేసారు. అరుణ కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు సీసీఎస్ పోలీసులు. మల్లన్న పై సెక్షన్ ఐపిసి 506, 509 ఐటి యాక్ట్ 67 కింది కేసు నమోదు అయింది. కాగా త్వరలో జరబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.