జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
జనసేన బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు
జనసేన ప్రకటించింది. తమ
పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని
జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ వేమూరి
శంకర్ గౌడ్ ప్రకటించారు. అధికార
టీఆర్ఎస్,
కాంగ్రెస్,
బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోరు సాగనుంది. టీఆర్ఎస్-మజ్లిస్ కలిసి బరిలో దిగనుండగా.. గత
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి బరిలో దిగి చేతులు కాల్చుకున్న
కాంగ్రెస్ ఈసారి ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది.
ఇక ఏపీలో
బీజేపీ,
జనసేన మధ్య పొత్తు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదు. కానీ దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్..
బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ
పార్టీ పోటీ చేస్తుందని
జనసేన ప్రకటించడం..
బీజేపీ అభిమానుల్లో టెన్షన్‌కు కారణమైంది.