తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. కొత్త కరోనా కేసులు దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ కంటే తెలంగాణ‌లో కొత్త క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా  ఈ రోజు 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య 3 ల‌క్ష‌లు దాటేసింది. ఇప్పటి వరకూ కరోనాతో తెలంగాణ లో 1,635 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 1,907 యాక్టివ్ కేసులున్నాయి. ఇక్క‌డ కోలుకుని 2,95,544 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: