తిరుప‌తి ఉప ఎన్నిక‌కు ముందే టీడీపీకి వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్యపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి టి.వనజ శనివారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే ప‌లువురు నేత‌లు టీడీపీని వ‌దిలి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఇక అదే చిత్తూరు జిల్లాలోని పలమనేరు రూరల్‌ మండలంలోని టి.వడ్డూరు మాజీ సర్పంచ్‌ గోవిందరాజులుతోపాటు 25 కుటుంబాలు ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: