అయితే ట్వీట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో.. "ప్రతి ఒక్కరూ తల్లి విలువ తెలుసుకునేలా, ప్రతి ఒక్కరికీ తల్లిపట్ల గౌరవం పెంచేలా 'అమ్మకు వందనం' పేరిట ఒక కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు అదే పిల్లలు 'అమ్మ మొగుడు' లాంటి మాటలు వింటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతాలలో వైద్యం అవసరం అయితే బైక్ అంబులెన్స్ లు వెళ్ళేవి. కానీ నిన్నగాక మొన్న విశాఖ జిల్లా పాడేరు మండలంలో గర్భిణీని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. అరకు మండలంలో ఒక గర్భిణిని రెండు కిలోమీటర్లు నడిపించాల్సి వచ్చింది. అమ్మ ఒడి అని ఈ చేత్తో ఇచ్చి, ఆ అమ్మ చేతి నుంచే నాన్న బుడ్డీకి లాక్కుంటుంటే కుటుంబాన్ని నడపలేక అమ్మకు ఎంత యాతన. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇక నుంచైనా తల్లుల ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. మాతృమూర్తులందరికీ పాదాభివందనం".. అంటూ ట్వీట్ చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి