ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దాదాపుగా అన్నీ దేశాలను కూడా పట్టి పీడిస్తుంది. ఈ మహమ్మారి నుండి బయట పడేందుకు ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. ఇక ఈ మహమ్మారి సోకిన బాధితుడిలో వైరస్ గుర్తించేందుకు కాస్త ఎక్కువగానే సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో  కేవలం ఒక్క క్షణంలో కరోనా ఫలితాన్ని రాబట్టే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోసెన్సార్స్‌ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షను చేసే విధానాన్ని కనుగొన్నట్లు అమెరికాకు చెందిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. తాము తయారుచేసిన బయోసెన్సార్స్‌ స్ట్రిప్‌ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న షుగర్‌ టెస్ట్‌ స్ట్రిప్‌ను పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మరోవైపు ఇంటివద్దే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకునే నూతన యాంటీజెన్‌ కిట్‌ భారత్‌లో సైతం అందుబాటులోకి వచ్చింది. మైల్యాబ్‌ అభివృద్ధి చేసిన కొవిసెల్ఫ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌ ద్వారా కేవలం పదిహేను నిమిషాల్లోపే కొవిడ్‌ నిర్ధారణ చేసుకోవచ్చని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఈ కిట్‌ ధర రూ.250 మాత్రమే అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: