ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ రోజు జరిగిన కెబినేట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన
అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థులకు డబ్బులు బదులుగా ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని ఆమోదంతెలిపారు.ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీకి సంబంధించిన విధివిధానాలను తర్వలో ఖరారు చేయనుంది.కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు,కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే గత ఏడాదిన్నర నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు జరుగుతన్నాయి.ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి మొబైల్
ఫోన్ కానీ ల్యాప్‌ట్యాప్‌కానీ అవసరం ఉంటుంది.దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ల్యాప్‌ట్యాప్‌ల పంపిణీకి సిద్ధమైంది.