కరోనా వైరస్ సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడటానికి దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ విషయంలో దేశంలో కొత్త రికార్డు సాధించింది. ఇప్పటివరకు దేశంలో 50 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. ఇది ఒక రకంగా చూస్తే విజయం అనే చెప్పాలి. ఈ సందర్భంగా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేస్తూ, "కరోనాపై పోరాటంలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయం, వ్యాక్సిన్ లో దేశం 50 కోట్ల మార్కును దాటింది. అందరికీ అభినందనలు మరియు ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ఇక పీఎం మోడీ కూడా దీని గురించి ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటివరకు 3,10,55,861 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 40,017 మంది కోలుకున్నారు. అదే సమయంలో, గత 24 గంటల్లో 38,628 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,12,153గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి