పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప: ది రైజ్-పార్ట్ 1" క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టేశారు మేకర్స్. వెంటనే సినిమా ఫస్ట్ సింగిల్ "దాక్కో దాక్కో మేక"ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందరి దృష్టిని తవైపుకు తిప్పుకున్నాడు "పుష్ప"రాజ్. ఆ సాంగ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.


అందులో అల్లు అర్జున్ తో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా దర్శనం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి సాంగ్ లోని చిన్న లిరిక్ విన్పించారు. ఈ సాంగ్ ను 5 భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రోమో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ "పుష్ప"ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం డిసెంబర్ 25న, రెండవ భాగం 2022లో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: