తెలంగాణ లో రాజకీయాలు ఎటు వెళుతున్నాయి అన్నట్లు ఉన్నప్పటికీ , ముఖ్య మంత్రి కేసీఆర్ మరియు అతని కుమారుడు కేటీఆర్ లు వారి ఉదార స్వభావాన్ని ఎప్పుడూ చాటుతూనే ఉంటారు. తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి కేసీఆర్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రేవల్లి ప్రాంతానికి చెందిన బాల్‌రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌ గా పనిచేస్తున్నారు. అతనికి శివాని అనే కూతురు వుంది. వీరు 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. గత కొంత కాలంగా శివాని "పారక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినురియా (పీఎన్ఎన్)" అనే వ్యాధితో బాధపడుతూ వుంది.


ఈ వ్యాధి నయం చేయడానికి డాక్టర్స్ 30 లక్షల ఖర్చవుతుందని చెప్పడంతో. బాల్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో తెరాస వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలసి తనకూతురుకున్న వ్యాధి ని గురించి వివరించారు. చలించిన మంత్రి ... మంత్రి నిరంజన్ రెడ్డి  ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించి  20 లక్షల రూపాయల చెక్ ను ఆమె వైద్యానికి మంజూరు చేశారు. ఆ చెక్ ని నిరంజన్ రెడ్డి మంగళవారం నాడు బాల్ రెడ్డి కి అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి సహాయం చేసినప్పటికీ ప్రజలు మాత్రం అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖనాల్లో ఉచితంగా అందిస్తే ప్రజలకు ఈ అడుక్కునే కర్మ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు  


మరింత సమాచారం తెలుసుకోండి: