ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరులోని గోలగమూడి లో జరిగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభకు సీఎం జగన్  హాజరు కానున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్.. రేపు ఉదయం 10 గంటలకు నెల్లూరు బయల్దేరి వెళ్తారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంతాప సభకు హాజరై మళ్లీ తిరిగి 2.30 గంటలకు సీఎం జగన్ విజయవాడకు చేరుకోనున్నారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించిన సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు కూడా సీఎం జగన్ హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి విద్యాసంస్థల్లో ఒకదాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన మేకపాటి  గౌతమ్ రెడ్డి వ్యవసాయ వర్శిటీగా చేయాలని ఆ సమయంలో మేకపాటి తండ్రి కోరినట్టు తెలిసింది. ఈ అంశంపై సీఎం జగన్ రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: