ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం వైపుగా తీసుకెళ్తున్నాయా.. అమెరికా వర్సెస్ రష్యా, చైనా రాజకీయాలు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా.. ఓ వైపు ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించడం మూడో యుద్ధానికి దారి తీస్తుందా.. ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. పెలోసీ యాత్రపై చైనా మండిపడుతోంది. అమెరికాకు బుద్ది చెప్పాలని గట్టి పట్టుదలతో ఉంది.

మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా అవసరమైతే అమెరికాపై అణు యుద్ధానికి కూడా వెనుదీయబోమని ఇటీవల ప్రకటించారు. అటు రష్యా కూడా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉక్రెయిన్‌కు సాయమందిస్తున్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ వరుస పరిణామాలు శాంతి కాముకులను కలవరపెడుతున్నాయి. అణ్వాస్థ్రాలను గుట్టలుగా పోగేసుకున్న దేశాలు ఇలాంటి వివాదాల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: