పశ్చిమ గోదావరి జిల్లా సిఎం సభకు హాజరైన యువతులను నల్ల చున్నీలు తొలగించి మరీ సభకు పంపడం వివాదాస్పదం అవుతోంది. నల్ల చున్నీలు ఉంటే.. నిరసన తెలిపే అవకాశం ఉందన్నదే ఇందుకు కారణమని అంటున్నారు. దీన్ని జనసేన పి ఏ సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా చేయడం చాలా తప్పు అంటున్న జనసేన పి ఏ సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ..  ఇందులో పోలీసుల తప్పు కంటే ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని అన్నారు.


ఇది ముమ్మాటికీ మహిళలను అవమానపరచడమే అని జనసేన పి ఏ సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. జనసేన పి ఏ సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్ర లో వారం రోజులు పాటు పర్యటిస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో నాదెండ్ల మనోహర్ కు జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో మీడియా తో మాట్లాడిన మాట్లాడిన మనోహర్ ముఖ్య మంత్రి జగన్ పర్యటన అంటే ప్రజలు భయ భ్రాంతులు అవుతున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: